అబ్బే..ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: చంద్రబాబు

మాహాకూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రతిపాదించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. స్టాలిన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనేది లోక్ సభ ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్ లో చంద్రబాబు మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.

ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది ఒకరు తీసుకునే నిర్ణయం కాదని… కూటమిలోని నేతలంతా కలసి తీసుకోవాల్సిన నిర్ణయమని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ కాంక్లేవ్ లో రాష్ట్ర రాజకీయాలు, ఎన్డీయే ప్రభుత్వ వైఖరి, లోక్ సభ ఎన్నికలపై ఆయన విస్తృతంగా మాట్లాడారు.

Loading…