ఇకపై ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే సర్వే ఫలితాలు వెల్లడిస్తా: లగడపాటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లగడపాటి రాజగోపాల్ తన సర్వే వివరాలను బయటపెట్టారు. కానీ ఫలితాల తర్వాత ఆయన సర్వే పూర్తిగా తారుమారైంది. ఆయన చెప్పిన స్థానాలన్నీ తారుమారయ్యాయి. దీంతో లగడపాటి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను సర్వేలు చేయడం మాత్రం మాననని.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా సర్వే చేస్తానని లగడపాటి స్పష్టం చేశారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. ఇక నుంచి తన సర్వే ఫలితాలను ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే వెల్లడిస్తానని లగడపాటి తెలిపారు.

Loading…