కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ముఖ్యం… సీఎం ఎవరనేది తర్వాత అంశం : జానారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు. ఎన్నికల వేళ సీఎం అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతం అన్నారు. ప్రజలు అధికారం అప్పగిస్తే హామీలు నెరవేర్చే సత్తాలేక కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, డబ్బు మూటలు వెదజల్లి తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ తీరును ప్రజలు అర్థం చేసుకున్నారని, ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాగా, ఈనెల 8వ తేదీన కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని జానారెడ్డి తెలిపారు.

Loading…