కేసీఆర్, జగన్, పవన్ లాంటి ఎన్ని మోదీ సేనలొచ్చినా ‘చంద్ర సేన’ను ఏమీ చేయలేవు

సీఎం కావాలన్న తపనతోనే జగన్ పాదయాత్రలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీ కాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ధర్మపోరాట దీక్ష సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవి లభిస్తే కనుక తనపై కేసులను మాఫీ చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు మంచి చేయాలని సీఎం తపిస్తున్నారని, పేదలకు అండగా ఉండే ఏకైక పార్టీ టీడీపీయేనని ప్రశంసించారు. చిన్న కోడికత్తి గాయానికే ఢిల్లీ గడప తొక్కిన చరిత్ర వైసీపీదని విమర్శించారు. కేసీఆర్, జగన్, పవన్ లాంటి ఎన్ని మోదీ సేనలొచ్చినా ‘చంద్ర సేన’ ను ఏమీ చేయలేవని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.

Loading…