జగన్‌ను చూసి కోళ్లు కూడా సిగ్గుపడతాయి

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌పై ఎంపీ మురళీమోహన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను చూసి కోళ్లు కూడా సిగ్గుపడేలా ప్రవర్తించారని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ కాస్తా కోడికత్తి పార్టీగా మారిపోయిందని సెటైర్ వేశారు.

బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతోనే జాతీయ పార్టీతో జతకట్టినట్టు ఆయన తెలిపారు. ఏపీలో పొత్తు విషయమై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని మురళీమోహన్ తెలిపారు. సుమారు 18 కేసుల్లో జగన్ ఏ-1 ముద్దాయిగా ఉన్నారని.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ప్రజలే ఆలోచించాలన్నారు. తండ్రి వైఎస్సార్ హయాంలో జగన్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని మురళీమోహన్ ఆరోపించారు.

Loading…