జగన్ పాదయాత్రలో మరో మైలురాయి.. బాబుగారు చూస్తున్నారా ??

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర అన్ని జిల్లాలను దాటి చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు పాదయాత్ర 3,500 కిలోమీటర్లను చేరుకుంది. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద జగన్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి.

Loading…