జనసేనకు పార్టీ గుర్తు వచ్చేసింది

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు వివిధ గుర్తులను కేటాయించిన ఈసీ.. పవన్ జనసేనకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ‘గాజు గ్లాసు’ గుర్తుతోనే బరిలోకి దిగనున్నారు. జనసేనకు ఎన్నికల సంఘం గుర్తు ప్రకటించిన వెంటనే ఆ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా జనసేన కార్యకర్తలు, అభిమానులతో ఆ విషయాన్ని పంచుకున్నారు.

Loading…