‘జనసేన’లో చేరనున్న టీడీపీ నాయకుడు రావెల?

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. డిసెంబర్ 1న జనసేన’లో ఆయన చేరనున్నట్టు రావెల వర్గీయుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న రావెల, కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని ఆయన వీడనున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఇప్పటికే రెండు సార్లు ఆయన కలిశారట. పార్టీ మారే విషయమై రావెల తన అనుచరులతో చర్చించారని సంబంధిత వర్గాల సమాచారం.

Loading…