జనసేనలో చేరిన ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సోదరుడు

ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి జనసేనలో చేరారు. ప్రస్తుతానికి లక్ష్మణమూర్తి ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా లేరు. జనసేనలో ఆయన చేరికపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, తమ స్వగ్రామం పెదగాడవిల్లి అయినప్పటికీ పొరుగున ఉన్న చినగాడవిల్లి, మునిపల్లి గ్రామాల్లోని కాపు సామాజికవర్గం తమ కుటుంబానికి గత మూడున్నర దశాబ్దాలుగా అండగా ఉందని చెప్పారు. ఈ మూడు గ్రామాల్లోని కాపు యువత జనసేనలో చురుకైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. వారందరికీ అండగా ఉండటం తమ కుటుంబ బాధ్యతగా భావించి… తాను జనసేనలో చేరానని చెప్పారు.

Loading…