తెలుగులోకి ప్రియా వారియర్

మలయాళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ చిత్రమే ‘ఒరు ఆదార్ లవ్’. ఈ సినిమా నుంచి వదిలిన ఒక వీడియోలో కన్నుగీటిన ప్రియా వారియర్ ను చూసి కుర్రాళ్లంతా మనసు పారేసుకున్నారు. ఈ ఒక్క సినిమాతో ఆమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ రోజు నుంచి ప్రియా వారియర్ పేరు కుర్రాళ్ల నాలుకలపై నానుతూనే వుంది. ఒమర్ లూలూ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

గురురాజ్ .. వినోద్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. తాజాగా వాళ్లు మాట్లాడుతూ .. “గట్టి పోటీని ఎదుర్కొని ఈ సినిమా తెలుగు హక్కులను మేము దక్కించుకున్నాము. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, ఫిబ్రవరి 14వ తేదీన ‘లవర్స్ డే’ అనే టైటిల్ తో ఈ సినిమాను విడుదల చేయనున్నాము. ఇంతటి క్రేజీ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా వుంది” అని చెప్పుకొచ్చారు.

Loading…