దేశ ప్రజలను మరోసారి వంచించే విధంగా కేంద్ర బడ్జెట్ – రాయపాటి రంగారావు

2014ఎన్నికలలో అవాస్తవ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరోమారు ఇదే విధంగా ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చేందుకుబీజేపీ ప్రభుత్వం పడరాని పాట్లు పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రభుత్వం మ్యానిఫెస్టోను తలపించే విధంగా మధ్యంతరబడ్జెట్ ను తీసుకురావటంలోనే బీజేపీ ప్రభుత్వానికి ఉన్న పదివీకాంక్ష తేటతెల్లమైందన్నారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల నడ్డివిరిచే విధంగా ఉన్నాయనికానీ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ వివిధవర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించిన విధానం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అభద్రతా భావంతో కురుకుపోయిందనేది స్పష్టంగాకనిపిస్తుందన్నారు.

లోటు బడ్జెట్ తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపుల ప్రస్తావన లేకపోవటం శోచనీయమన్నారు, ఏ ఒక్క బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఊరట కలిగించే అంశాలులేకపోవటం విభజన సమయంలో ఇచ్చిన హామీల ప్రస్తావనలైన ప్రత్యక హోదా, రైల్వే జోన్ వంటి హామీల ప్రస్తావన లేకపోవటం మోడీ మోసపూరిత, అహంకారపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా అని రాయపాటి రంగారావు ప్రశ్నించారు. ఈ రోజు రైతులకు ఆరువేల పంటసాయం ప్రకటించిన మోడీకి ఇన్ని రోజులు రైతుల కష్టాలు తెలియలేదా అని, ఏడాదికి ఆరువేలు ఇవ్వటమేమిటని దీని ద్వారా మోడీ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేందుకు తహ తహ లాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో రైతులకు 24వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనతముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారిదని రంగారావు పేర్కొన్నారు.ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తే వారిని దారుణంగా కొట్టించిన మోడీ ఏవిధంగా తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటారో దేశప్రజలకు చెప్పాలన్నారు.

Loading…