‘పడి పడి లేచె మనసు’ తొలిరోజు వసూళ్లు

శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘పడి పడి లేచె మనసు’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా, రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను పలకరించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 1.8 కోట్ల షేర్ ను రాబట్టింది. శని .. ఆదివారాల్లో వసూళ్లు పెరిగే అవకాశం వుంది. మంగళవారం క్రిస్మస్ సెలవు కావడంతో, ఆ రోజున కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం వుంది.

ఇంతకు ముందు శర్వానంద్ చేసిన ‘మహానుభావుడు’ తొలి రోజున ‘2.6 కోట్ల షేర్ ను సాధించింది. ఆ సినిమా కంటే ‘పడి పడి లేచె మనసు’ తొలి రోజు వసూళ్లు తక్కువగా ఉండటం శర్వానంద్ అభిమానులకు నిరాశను కలిగించేదే. అయితే వీకెండ్ లో వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందనే చెబుతున్నారు. శర్వానంద్ .. సాయిపల్లవి నటన .. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. సంభాషణలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనేది ప్రేక్షకుల మాట.

Loading…