‘పాతాళ భైరవి’లో తోట రాముడిగా బాలకృష్ణ

ఎన్టీ రామారావు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘పాతాళ భైరవి’ ముందు వరుసలో కనిపిస్తుంది. తెలుగు జానపద చిత్రాల జాబితాలోను ఈ సినిమా ముందు వరుసలోనే కనిపిస్తుంది. ఒక ట్రెండ్ సెట్టర్ లా నిలిచిన ఈ సినిమాలో ఎన్టీ రామారావు ‘తోట రాముడు’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ కూడా ‘తోట రాముడు’గా తెరపై సందడి చేయనున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో ‘పాతాళ భైరవి’ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు కూడా వున్నాయి. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ‘తోట రాముడు’గా బాలకృష్ణ అదరగొట్టేస్తున్నాడని అంటున్నారు. ఈ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కూడా క్రిష్ త్వరలో వదిలే అవకాశం వుంది. ఆ రోజు కోసం బాలకృష్ణ అభిమానులు వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. ‘కథానాయకుడు’గా ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Loading…