పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు స్పందించారు. డిసెంబర్ 17న పోలవరం డ్యామ్ కు గేట్లు బిగిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ రికార్డులు తిరగరాసే వేగంతో పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని అన్నారు. అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు అవిశ్రాంతంగా పోలవరం నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

ట్విట్టర్ లో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ‘డిసెంబర్‌ 17న పోలవరం గేట్లు బిగిస్తాం. ప్రపంచ రికార్డులు అన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జ‌రుగుతున్నాయి. 2019 ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధానమైన పనులన్నీ పూర్తిచేస్తాం’ అని ట్వీట్ చేశారు.

Loading…