మరోసారి నిరాహారదీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. జనవరి 30న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో ఆయన నిరశన దీక్షను చేపట్టనున్నారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు ఆయన లేఖ రాశారు. లోక్ పాల్ మరియు లోకాయుక్త చట్టం 2014ను అమలు చేస్తామని చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలు కాలేదని, హామీలుగానే మిగిలిపోయాయని లేఖలో ఆయన ఆరోపించారు.

ఇదే అంశంపై ఈ నెల ప్రారంభంలో అన్నా హజారే మాట్లాడుతూ, మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయిందని… కానీ, ఇంత వరకు లోక్ పాల్, లోకాయుక్తలను ఆయన నియమించలేదని మండిపడ్డారు. లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలన్న ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని దుయ్యబట్టారు.

Loading…