రాష్ట్రాన్ని నిండా ముంచిన బీజేపీ ప్రభుత్వం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విభజన హామీలను గాలికి వదిలేసి నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం నిండా ముంచిందని, అందువల్ల ఆంధ్రాలో పర్యటనకు వస్తే ప్రధాని మోదీని అడ్డుకుని తీరుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ఈనెల 10న గుంటూరులో, 16న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన హామీల అమల్లో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు. ఈవీఎంలపై తమకూ అనుమానాలున్నాయని, ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ అన్నారు. మరో వైపు రాష్ట్రంలో ప్రజాబలం కంటే అవినీతి సొమ్ముతో గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారని విమర్శించారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు పార్టీ మార్పును రాజకీయ వ్యభిచారంగా రామకృష్ణ పేర్కొన్నారు.

Loading…