లోకేష్ సవాళ్లకు నవ్వొస్తోంది: విజయసాయి

దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టిన నారా లోకేశ్ రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలెన్నో, ఐటీ కంపెనీలెన్నో ఆరు నెలలు ఆగితే లెక్కతేలుస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. లోకేష్ సవాళ్లు వింటే అందరికీ నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి బోగస్ కంపెనీలకు వందల కోట్ల విలువైన భూములు, రాయితీలిచ్చిన సంగతి ప్రజలు తెలుసన్నారు. ఎల్లో కుల మీడియా దాచిపెట్టినంత మాత్రాన నిజాలు ప్రజలకు తెలియకుండా ఉంటాయనుకుంటే పొరబాటేనని అన్నారు.

‘ప్రతిపక్ష నాయకుడు ఎండ, వానా తేడా లేకుండా ప్రజల మధ్య పాదయాత్ర చేస్తుంటే కనిపించడం లేదా? చిట్టీ’ అంటూ లోకేష్‌ను విజయసాయి వ్యంగ్యంగా ప్రశ్నించారు. వారంలో నాలుగు రోజులు అమరావతి, మూడు రోజులు హైదరాబాద్ దాటి రాని నువ్వా మమ్మల్ని విమర్శించేది అంటూ నిలదీశారు. ఏపీ ప్రజల నుంచి బందిపోటుల్లా దోచుకున్న డబ్బును తెలంగాణ ఎన్నికల్లో వెదజల్లింది ఎవరో? తెలియనిది కాదన్నారు. అక్కడి ప్రజలు ఫుట్‌బాల్‌లా ఆడుకుంటే జైపూర్, భోపాల్ చుట్టూ తిరిగి రావడమేనా ప్రజాసేవా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Loading…