వైసీపీ కుట్ర రాజకీయాలను ప్రజలు సహించరు …!

రాష్ట్రంలో సంభవిస్తున్న విపత్కర పరిస్థితులను సమర్ధతవంతంగా ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై వైసిపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు పేర్కొన్నారు. మంగళవారం నాడు గుంటూరులో ఆయన పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటంలో వైకాపా దిట్టన్నారు. విశాఖపట్నంను హుద్ హుద్ తుఫాన్ అతలాకుతలం చేస్తే వైకాపా నాయకులు విజయమ్మను ఓడించిన ప్రజలు తగిన మూల్యం చెల్లించుకున్నారని, వైకాపా నాయకులు టపాసులు కాల్చిన విషయం ప్రజలు ఇంకా మరువలేదన్నారు. మొన్న ఉత్తరాంధ్రను తిత్తిలి తుఫాన్ అతలాకుతలం చేస్తే, జగన్ పాదయాత్రకు 70 కి.మీ ల దూరంలో ఉన్న తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించే సమయం కుడా లేని వైకాపా అధినేత జగన్ కు మరియు ఆ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను విమర్శించే అర్హత లేదని రంగారావు తెలిపారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు అప్రమతతో వ్యవహరించటం వలన ప్రాణనష్టం తప్పిందని, అయితే అనేక కేసులను ఎదుర్కున్న చరిత్ర A2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి మరియు ఆ పార్టీ నాయకులది అయితే, అనేక విపత్కర సంక్షోభాలను దీటుగా ఎదుర్కున్న చరిత్ర చంద్రబాబుదని రంగారావు ఎద్దేవా చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హుద్ హుద్, తిత్తిలి, పెధాయి తుఫాన్ వంటి సమయంలో విజయసాయిరెడ్డి, జగన్ లు ఎక్కడా ఉన్నారు. తుఫాన్ లు సంభవించి ప్రజలు అల్లాడుతుంటే జగన్ కాని విజయసాయి రెడ్డి కాని, వారి పార్టీ నాయకులు మరియు కార్యకర్తల ను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనమని ఎందుకు చెప్పలేదని ఇదేనా మీ పార్టీ గవర్నెన్స్ అని రంగారావు ప్రశ్నించారు. ఒక పక్క తుఫాన్ సహాయక కార్యక్రమాలలో మంత్రులు మరియు అధికార యంత్రాంగం మునిగి ఉంటే విజయసాయి రెడ్డి ఈ రకమయిన వ్యాఖ్యలు చేయటం విడ్డూరమని అన్నారు.

Loading…