బాలకృష్ణ ఇగో కు చెక్ పెట్టిన బ్రాహ్మణి జోష్ లో జూనియర్ !

‘అరవింద సమేత’ సక్సస్ మీట్ బాలకృష్ణ జూనియర్ గొప్పతనం గురించి ఎక్కువ మాట్లాడలేదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో అసలు ఆ ఫంక్షన్ ఇంకా జరగకుండానే బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి జూనియర్ ఎన్టీఆర్ కు పంపిన ఒక అరుదైన గిఫ్ట్ జూనియర్ కు విపరీతమైన భావోద్వేగాన్ని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి.
‘అరవింద’ సక్సస్ మీట్ కు బాలకృష్ణ రావడం జూనియర్ కు ఒక గిఫ్ట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే అంతకన్నా విలువైన గిఫ్ట్ ను జూనియర్ కు బ్రాహ్మణి పంపించి తమ కుటుంబాల మధ్య ఉన్న ప్రేమానురాగాలను మరొకసారి బయటపెట్టింది.

విజయదశమి రోజున తన అన్న ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ బ్రాహ్మణి హరికృష్ణకు సంబంధించిన అరుదైన ఫోటోలతో కూడిన ఒక ఆల్బమ్ ను పంపించి ఆ ఫోటోలు అన్నీ తాను తన తండ్రి బాలయ్య ఫోటోల కలక్షన్స్ లోంచి ఎంపిక చేసినట్లుగా పేర్కొంటూ జూనియర్ కు షాక్ ఇచ్చింది. హరికృష్ణకు సంబంధించిన ఈ అరుదైన ఫోటోలు జూనియర్ వద్ద కూడ లేకపోవడంతో తారక్ తన చెల్లి పంపించిన గిఫ్ట్ ను చూసి మురిసిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిన్న జరిగిన ‘అరవింద’ సక్సస్ మీట్ లో బాలకృష్ణ తన అన్న హరికృష్ణ గురించి మాట్లాడుతూ తన అన్న ఒక మొరటు మనిషి అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే హరికృష్ణ మనసు వెన్నలా కరిగిపోతుందని అదే ఆయన గొప్పతనం అంటూ బాలయ్య హరికృష్ణ పై చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిన్నటి ఫంక్షన్ లో బాలయ్యా జూనియర్ ల మధ్య ప్రేమానురాగాలు పెద్దగా కనిపించకపోయినా బాలకృష్ణ హరికృష్ణ గురించి మాట్లాడిన మాటలు మాత్రం బాలకృష్ణ మనసులోంచి వచ్చినవిగా అనిపిస్తున్నాయి. ఇంత అభిమానం ఉంది కాబట్టే హరికృష్ణ పాత్రను ఎన్టీఆర్ బయోపిక్ లో ఏమాత్రం తగ్గించకుండా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రతో ఇంచుమించు సరిసమానంగా బాలయ్య ఎలివేట్ చేస్తున్నాడు అనుకోవాలి..

Loading…