బాలాపూర్ లడ్డు తర్వాత చేవెళ్ల లడ్డునే అత్యధిక ధర పలికింది..

దేశంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన గణపతి లడ్డు అంటే ఎవరైనా బాలాపూర్ లడ్డు గురించే మాట్లాడుకుంటున్నారు. స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డూలను వేలంలో దక్కించుకోడానికి భక్తులు పోటీపడుతుంటారు. ఎంత ధరకైనా లడ్డు ను దక్కించుకోవాలని భక్తులు భావిస్తారు. వీటిలో బాలాపూర్ లడ్డూకి తీవ్ర పోటీ ఉంటుంది. ఈ ఏడాది కూడా దీని భారీగా పలికింది. బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు దక్కించుకున్నారు.

గత ఏడాది కంటే ఓ లక్ష ఎక్కువకె ఈసారి లడ్డు ధర పలికింది. తాజాగా బాలాపూర్ లడ్డు తర్వాత అంత ధర పలికింది చేవెళ్ల వినాయకుడి లడ్డు. ఈ లడ్డు వేలంలో రూ.16,01,001 కు బండారు ఆగిరెడ్డి గ్రూపు సభ్యులు లడ్డును దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డు తర్వాత రికార్డు స్థాయి ధర పలికింది చేవెళ్ల వినాయకుడి లడ్డూనే అని తెలుస్తుంది. నవరాత్రులు పూజలు అందుకున్న ఈ లడ్డు ఎంతో మహిమగలది కావడం తో లడ్డు కు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Loading…