బోయపాటి ఖర్చుతో తల పట్టుకున్న నిర్మాత..?

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. డీవీవీ దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ వినయ విధేయ రామ అని కానీ రౌడీ తమ్ముడు అని కానీ పెడుతున్నట్లుగా గత పది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే రేపు దసరా సందర్భంగా రామ్ చరణ్ #RC12 ఫస్ట్ లుక్ లేదా టైటిల్ రివీల్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

భారీగా ఖర్చు పెట్టిస్తున్న బోయపాటి…
అయితే ఇప్పటికే 120 రోజుల షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా 35 నుండి 40 రోజుల బ్యాలెన్స్ ఉందంటున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో నింపుతున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకి లెక్కకు మించి నిర్మాతతో ఖర్చు పెట్టిస్తున్నట్లుగా ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదట్లో రామ్ చరణ్ కంట్రోల్ తో నిర్మాణ ఖర్చులను తగ్గించినప్పటికి అరుదైన లొకేషన్స్…భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అంటూ బోయపాటి ఖర్చు పెట్టించేస్తున్నాడట.

రాబడికి తగ్గట్లే ఖర్చు…
అసలు సినిమా బిజినెస్ 75 కోట్ల నుండి మొదలై శాటిలైట్, డిజిటల్ అన్ని హక్కులతో కలిసి 135 కోట్ల వరకు ఉంటుందని… రాబడికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ఖర్చు కూడా అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బోయపాటి చేసే ఖర్చు చూసి నిర్మాత దానయ్య కూడా కక్కలేక మింగలేకుండా ఉన్నాడంటున్నారు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు రామ్ చరణ్ నిర్మాత మీద భారం పడకుండా ఉండేందుకు చాలా ఖర్చులు తగ్గించేలా చూశాడని కానీ రాను రాను బోయపాటి మాత్రం అన్ని భారీ హంగులతో షూటింగ్ చెయ్యడంతో భారీగా ఖర్చు అవుతున్నట్టుగా తాజాగా న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం వైరల్ అయ్యింది. కియారా అద్వానీ హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతుంది.

Loading…