కోడిపందేలపై ‘పశ్చిమ’ తహసీల్దార్లకు నోటీసులు

పశ్చిమగోదావరి జిల్లాలోని తహసీల్దార్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా పేరుతో షోకాజ్‌ నోటీజులు జారీ అయ్యాయి. గత సంక్రాంతికి జిల్లాలో కోడి పందేలు నిర్వహించారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్డు ఆదేశాలకు భిన్నంగా పందాలు నిర్వహించినందుకు తహసీల్దార్‌లకు తాఖీదులు జారీచేశారు. కోడి పందేలను రద్దు చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చినా కోడి పందేలు నిర్వహించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ తహసీల్దార్‌లకు ఇప్పుడు నోటీసులు జారీచేశారు. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Loading…