దీపిక పెళ్లి డేటు వెనుక

స్పెన్స్‌కు తెరదించింది బాలీవుడ్ జంట దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్. తమ పెళ్లి తేదీని ట్విటర్ వేదికగా ప్రకటించేసింది. ఇద్దరూ నాలుగు నిమిషాల వ్యవధిలో తమ పెళ్లి తేదీలను ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో తమ పెళ్లి జరగనున్నట్లు దీపికా, రణ్‌వీర్ సింగ్ వెల్లడించారు.

అయితే రణ్‌వీర్‌, దీపిక నవంబర్‌ 15నే వివాహం చేసుకోబోతుండడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. వీరిద్దరూ జంటగా నటించిన తొలి చిత్రం ‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా’. 2013లో నవంబర్‌ 15న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమని ఒకటి చేసిన ‘రామ్‌లీలా’ సినిమాను గుర్తుచేసుకుంటూ వివాహ వేడుకను 15న నిర్ణయించారట. అదీకాకుండా ‘రామ్‌లీలా’ సినిమా విడుదలై ఈ నవంబర్‌ 15తో ఐదేళ్లు పూర్తవుతుంది. వివాహ వేడుకలోనే ‘రామ్‌లీలా’ సెలబ్రేషన్స్‌ కూడా నిర్వహించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల టాక్.

Loading…