సామాన్య ప్రజల ఫై ‘గ్యాస్’ మంట..

ఇప్పటికే సామాన్య ప్రజల ఫై ఇంధన సంస్థలు మోపుతున్న భారాన్ని తట్టుకోలేకపోతుండగా , తాజాగా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర కూడా భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది. పెట్రోల్ లీటర్ ధర రూ. 100 , డీజల్ రూ. 90 లకు పరుగులు పెడుతూ సామాన్యులకు పెనుభారంగా మారుతుంటే..తాజాగా కేంద్రం వంటగ్యాస్‌ ధరలను పెంచింది.

సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీరహిత బండపై రూ.59 చొప్పున పెరిగింది. అంతర్జాతీయ ధరల్లో మార్పుల వల్లే ధరలను పెంచినట్టు ఐఓసీ తెలిపింది. పెరుగుతున్న ధరలను చూసి ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Loading…