గెలుచుకున్న 50 లక్షలను కౌశల్ ఏం చేస్తున్నాడో తెలుసా

బిగ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచిన విషయం తెలిసిందే. నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 లో అనామకుడిగా అడుగుపెట్టిన కౌశల్ రోజు రోజుకి తన స్థాయి పెంచుకుంటూ ఏకంగా కౌశల్ ఆర్మీ తయారయ్యేలా చేసుకున్నాడు. ఎలిమినేషన్ వచ్చిన ప్రతీ సందర్భంలో కౌశల్ ఆర్మీ సహాయంతో భారీ ఎత్తున ఓట్లు కొల్లగొట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని ని మాత్రమే కాదు చివరకు బిగ్ బాస్ ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నాడు కౌశల్. ఈ స్థితికి రావడానికి కారణం కౌశల్ ఆర్మీ అండదండలు . ఇక బిగ్ బాస్ 2 లో విన్నర్ గా నిలిచిన కౌశల్ కు ట్రోఫీతో పాటుగా 50 లక్షల నగదు బహుమతి కూడా లభించింది.

ఆ మొత్తాన్ని కౌశల్ ఏం చేస్తున్నాడో తెలుసా…….. క్యాన్సర్ పేషెంట్ ల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడట . ఎందుకంటే కౌశల్ తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయిందట అందుకే క్యాన్సర్ బాధితుల సహయార్థం 50 లక్షలను వినియోగిస్తానని ప్రకటించాడు కౌశల్. ఇక బిగ్ బాస్ 2 ఫైనల్స్ లో విన్నర్ ని ప్రకటించడానికి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు . మొత్తానికి నిన్నటితో బిగ్ బాస్ 2 సీజన్ కంప్లీట్ అయ్యింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా , రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ ఎప్పుడో ? దానికి హోస్ట్ గా వ్యవహరించేది ఎవరో ?

Loading…