మారుతీరావుకు మద్దతుగా ఆర్యవైశ్యుల ర్యాలీ

ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావుకు ఆర్యవైశ్యులు మద్దతుగా నిలిచారు. నల్లగొండలోని వాసవీభవన్‌ నుంచి జైలు వరకు ఆర్యవైశ్య సంఘం, తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జైలులో ఉన్న మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌తో ములాకత్‌ అయ్యారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటుతో తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు.

Loading…