పోలవరంలో చంద్రబాబు సాహసం.. నిచ్చెనపై 25 మీటర్ల పైకెక్కి పూజలు!

పోలీసులు వద్దని వారిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సాహసం చేశారు. నిచ్చెన మెట్లపై 25 మీటర్లు ఎక్కి పూజలు చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్ద జరిగిందీ ఘటన. స్పిల్ వే‌పై 25 మీటర్ల ఎత్తున క్రస్ట్ లెవల్‌లో తొలి రేడియల్ గేటును బిగించాల్సి ఉంది. ఇందుకోసం అక్కడ తొలుత పూజలు చేయాల్సి ఉండడంతో చంద్రబాబు పైకి ఎక్కేందుకు సిద్ధమయ్యారు. భద్రతా పరమైన కారణాల వల్ల సీఎం పైకి ఎక్కేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పారు.

వారి అభ్యంతరాలను పక్కన పెట్టిన చంద్రబాబు ఇలాంటి చిన్నచిన్న విషయాలకు కూడా భయపడడం సమంజసం కాదన్నారు. తానే భయపడితే ఎలాగని, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందికి భరోసా ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అనంతరం నిచ్చెన ద్వారా స్పిల్‌వే పైకి ఎక్కి పూజలు చేశారు.

Loading…