అభిమానుల‌కు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన ప్ర‌భాస్?

రేపు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు కావ‌డంతో ఆయ‌న అభిమానులు ఈ పుట్టిన రోజుని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.అయితే ప్ర‌భాస్ కూడా అభిమాన‌ల‌కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.ర్ ప్రభాస్ సాహూతో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టడానికి సన్నద్ధమవుతున్నాడు. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ లో కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

అయితే రేపు ప్రభాస్ తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్బంగా సాహో టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తోంది. నేడు సాయంత్రం 4గంటలకు ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేయనున్నారు. ఇక రేపు సాహో మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మ‌రి దీనిపై ఇంక స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Loading…