లైంగిక వేధింపులు ఎక్కువగా చేసేది ఆ హీరోలే: శృతి

ప్రముఖ నటుడు అర్జున్‌పై శృతి హరహరణ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ‘నిబునన్’ చిత్రీకరణ సమయంలో అర్జున్ తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని, సినిమాను ఆపడం ఇష్టం లేకే అప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించలేదని శృతి ఇటీవల ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే శృతి చేసిన ఆరోపణలను అర్జున్ వెంటనే ఖండించారు. మరోవైపు సీనియర్ నటుడైన అర్జున్‌పై ఈ రకమైన విమర్శలు గుప్పించడం తగదని, శృతి చేసిన ఆరోపణలు చూసి షాకయ్యాయని ఆ సినిమా దర్శకుడు పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారి రకరకాల చర్చలు మొదలయ్యాయి.

తాజాగా ఇదే అంశం పై మీడియాతో మాట్లాడిన శృతి.. మరోసారి విరుచుకుపడింది. అర్జున్ అభిమానుల నుండి తనకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఇలాంటివన్నీ ఎదురవుతాయని ముందుగానే ఉహించానని తెలిపింది. అంతేకాదు ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్‌గా రాణించే హీరోలే ఎక్కువగా లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారని చెప్పి సినీ లోకాన్ని షాక్‌కి గురిచేసింది శృతి.

Loading…