[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » పిల్లాడే.. కానీ, ఏం చేశాడో తెలుస్తే షాక్ అవుతారు ..!

పిల్లాడే.. కానీ, ఏం చేశాడో తెలుస్తే షాక్ అవుతారు ..!

4 Years Old Boy Complaint on Grandmother

సినిమాలు, సీరియళ్ల ఎఫెక్టో.. లేక కలియుగం మహిమో.. ఏమో కానీ, పిల్లలో కాస్త జాగ్రత్తా అని చెప్పే సంఘటన ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. ఇంకా ఊహ కూడా తెలియని ఓ చిన్న పిల్లాడు ఏకంగా రాత్రి 9 దాటిన తరువాత పోలీసు స్టేషన్ కు వెళ్ళి తన నాయనమ్మపై ఫిర్యాదు చేశాడు. తనను ఆడుకోనివ్వకుండా అడ్డుకుంటోందని, తన డబ్బులు తీసుకుందని, ఆమెను జైళ్లో పెట్టాలని పోలీసులను పట్టుబట్టాడు. నాలుగేళ్ల ఆ బుడతడి మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. హైద‌రాబాద్‌లోని ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో గత మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తనను ఆరుబయట ఆడుకోకుండా తన నానమ్మ అడ్డుకొంటోందని ఆ బాలుడు ఆరోపించాడు. తన పిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయాలని ఆ బాలుడు పట్టుబట్టడంతో పోలీసులు ఇబ్బంది పడ్డారు. టీవీ సీరియళ్ల ప్రభావంతోనే బాలుడు పోలీస్ స్టేషన్ కు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నానమ్మని జైల్లో వేయకూడదని ఒప్పించిన పోలీసులు బాలుడికి చాక్లెట్లు ఇచ్చి సముదాయించారు. పోలీసుల హమీతో బాలుడు తన నానమ్మపై పిర్యాదును మానుకున్నాడు.పిల్లాడి తండ్రి ఓ కేబుల్‌ ఆపరేటర్. తన కొడుకుపై సీరియళ్ళ ప్రభావం కన్పిస్తోందని బాలుడి తండ్రి చెప్పాడు. పిల్లాడు చాలా యాక్టివ్ గా ఉన్నాడని, జాగ్రత్తగా చూసుకోమని పోలీసులు తల్లితండ్రులకు చెప్పారు ఇలాంటి సంఘటనల నేపధ్యంలో తల్లితండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం, చాలా అవసరమని చైల్డ్ సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
[X] Close
Share