[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » చిన్నారి ప్రాణాలు కాపాడిన అల్లు అర్జున్

చిన్నారి ప్రాణాలు కాపాడిన అల్లు అర్జున్

allu-arjun-donates-8-lakhs-for-child-nithishs-liver-operation
బన్నీ తమ మంచి మనసునుమరోసారి చాటుకున్నాడు. తాజాగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి 8 లక్షల సాయం అందించాడు. భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతిలకు జన్మించిన 7 నెలల బాబు కొన్నాళ్ళుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ కుటుంబానికి13 లక్షల సాయం అందించాయి. ఈ విషయం తెలుసుకున్న బన్నీ తన వంతు సాయంగా 8 లక్షలు ఇచ్చాడు. రీసెంట్ గా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆ బాబుకి కాలేయ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో పాటు అల్లు అర్జున్ కి బాబు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అర్జున్ అందించిన ఈ సాయంపై అటు అభిమానుల నుంచి, ఇటు సాధారణ ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

Loading...
[X] Close
Share