[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » అల్లు శిరీష్ మల్లూ శిరీష్ అనిపించుకోగలుగుతాడా ?

అల్లు శిరీష్ మల్లూ శిరీష్ అనిపించుకోగలుగుతాడా ?

allu-sirish-straight-movie-in-malayalam
బన్నీలా అతని తమ్ముడు అల్లు శిరీష్ కూడా మలయాళ ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. అయితే అనువాద చిత్రాల ద్వారా కాదు.. స్ట్రైట్ సినిమాతో. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, శిరీష్ కాంబినేషన్‌లో 1971 బియాండ్ బోర్డర్స్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో మోహన్‌లాల్ హీరో కాగా, ట్యాంక్ కమాండర్‌గా శిరీష్ కీలక పాత్ర చేయనున్నారు. మేజర్ రవి దర్శకుడు.అల్లు శిరీష్ మాట్లాడుతూ -మలయాళ తెరకు పరిచయం కావడానికి ఇది సరైన సబ్జెక్ట్. ఇందులో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నా.ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుంది. మోహన్‌లాల్ వంటి స్టార్‌తో కలసి నటించే అవకాశం రావడం నా లక్. త్వరలో షూటింగ్ మొదలవుతుంది అన్నారు. అల్లు అర్జున్‌ని ఆదరించి, ‘మల్లూ అర్జున్’ అని అభిమానంగా పిల్చుకుంటున్న మలయాళ
ప్రేక్షకులతో శిరీష్ కూడా మల్లూ శిరీష్ అనిపించుకోగలుగుతాడా ? చూడాలి.

Loading...
[X] Close