[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » మా ఇద్దరి మధ్య ఏం లేదు…!

మా ఇద్దరి మధ్య ఏం లేదు…!

Amala Paul Open Up about Dhanush Relationship

మలయాళీ భామ అమలాపాల్, డైరెక్టర్ విజయ్ నుండి విడిపోయాక అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. మొదట అమలాపాల్ కు ఆఫర్లు రావడమే కష్టమని అందరు భావించారు. కాని, అనూహ్యంగా గతంలో కన్నా అమ్మడు భారీ ఆఫర్ల ను బ్యాగ్ లో వేసుకుంది. అమ్మ కణక్కు, వాడా చెన్నై, వీఐపీ 2 సినిమాల్లో ధనుష్ సరసన రొమాన్స్ చేసే అవకాశం అమలా పాల్ కు వచ్చింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఒక ఎఫైర్ నడుస్తుందని కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. అయితే ఇన్ని రోజులు ఈ వార్తలపై నోరు మెదపని అమలాపాల్ తాజాగా ధనూష్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. విడాకుల తర్వాత డిప్రెషన్ లో ఉన్న తనకు ధనుష్ ఒక స్నేహితుడిలా సాయం చేసాడని, అంతకు మించి ధనుష్ తో ఏదో రిలేషన్ షిప్ పెట్టి తనను బ్యాడ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అమలాపాల్ ప్రశ్నించింది. నా భర్తతో నేను విడిపోకుండా ఉండేందుకు ధనుష్ చాలా ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. సమాజంలో ఆడవాళ్ళకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఫైర్ అయింది. అయిన కొందరు చేసే ఇలాంటి ప్రచారాలని తాను అసలు కేర్ చేయనంటూ ఖరాఖండిగా చెప్పింది ఈ భామ. మొత్తానికి మరో రూమర్ తనపై రాకుండా అమలాపాల్ గాసిప్పులపై ఓ రేంజ్ లో చెక్ పెట్టేసింది.

Loading...
[X] Close
Share