[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » బిత్తిరి సత్తికి పెళ్లి ప్రపోజ్ చేసిన శ్రీముఖి…!

బిత్తిరి సత్తికి పెళ్లి ప్రపోజ్ చేసిన శ్రీముఖి…!

సాధారణంగా ఇద్దరు వ్యక్తులు చనువుగా ఉంటే చాలు..వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ గుసలాడుకుంటారు. ఇక నటీ నటులు, యాంకర్స్ విషయం అయితే సరే సరి. వాళ్ళు కొంచెం చనువుగా ఉంటె చాలు ఇక గాసిప్ రాజాలు తమ పెన్నులకి పని చెప్తారు. ఇప్పుడిదంతా ఎందుకంటే..బుల్లి తెరపై ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారిన జంట రవి-శ్రీముఖి. వీళ్ళిద్దరూ కూడా ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ పంచె భాగంగా కాస్తంత ఓవర్ గానే మాట్లాడుకుంటారు.

దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇంతగా రెచ్చిపోతున్నారని గుసగుసలు. కానీ తాజాగా ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీముఖి…తనకు అసలు రవి అంటే ఇష్టం లేదని, నేను మిమ్మల్నే లవ్ చేస్తున్నాను, ఐ లవ్యూ అంటూ అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఈ భామ ప్రేమిస్తున్నట్టు చెప్పింది ఎవరికో తెలుసా..’బిత్తిరి సత్తి’కి. అవును..బాగా పాపులర్ అయిన సత్తి ప్రోగ్రాంకి గెస్ట్ గా హాజరైన శ్రీముఖి, తనకి యాంకర్ రవి కంటే కూడా నువ్వంటేనే చాలా ఇష్టం అని, మనం పెళ్లి చేసుకుందాం అని సత్తితో అనేసింది!
అదండీ అసలే అల్లరి సునామి శ్రీముఖి…ఆమె తో సత్తి ఇంటర్వ్యూ అంటే మీరే ఊహించుకోవచ్చు అక్కడ ఎన్ని పంచ్ పటాకాలు పేలాయో ..

Loading...
[X] Close