[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » షాకింగ్…15 కోట్లతో విడాకుల సెటిల్మెంట్?

షాకింగ్…15 కోట్లతో విడాకుల సెటిల్మెంట్?

Arbaaz Khan Opens Up on divorce with Malaika Arora

సెలబ్రేటీల జీవితాల్లో పెళ్లికి, డేటింగ్ కి తేడా లేకుండా పోతుంది. కొన్నాళ్లు కలిసి ఉండడం, ఆ తరువాత పరస్పర అంగీకారంతో విడిపోవడం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కామన్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ విషయంలో పెద్దగా మార్పులు లేవు. ఉత్తమ నటీనటులు కూడా నిజజీవితంలో ఉత్తమ భార్యభర్తలు కాలేకపోతున్నారు. ఈ జాబితాలో ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కూడా తన మలైకా ఆరోరాతో బ్రేకప్ అయ్యాడు. పరస్పర అంగీకారంతోనే ఇటీవల ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. చాలా సంవత్సరాల కాలంపాటు వైవాహిక జీవితం గడిపిన ఈ ఇద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ జంట విడిపోవాలని భావించింది. విడాకులకు ధరఖాస్తు చేసి.. కోర్టుకు కౌన్సిలింగ్ కు కూడా హాజరైంది. ఈ నేపథ్యంలో వీళ్ల మధ్య భరణం కూడా సెటిల్మెంట్ అయినట్టు సమాచారం. మలైకా పదిహేను కోట్ల రూపాయల భరణాన్ని డిమాండ్ చేయగా… అర్బాజ్ దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

Loading...
[X] Close