[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » నిర్మాతను నిండా ముంచేసిన ఎన్టీఆర్ సినిమా…!

నిర్మాతను నిండా ముంచేసిన ఎన్టీఆర్ సినిమా…!

aswini-dutt-sensational-comments-on-junior-ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్ తో 2016ను తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తే చాలు, మినిమం హిట్ గ్యారెంటీ కొంత పాజిటివ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్స్ కు కాసుల వర్షమే. కానీ..ఒక నిర్మాత మాత్రం తాజాగా ఒక ఛానల్మా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..తానూ ఎన్టీఆర్ తో తీసిన సినిమా వల్ల నిండా మునిగిపోయాను, ఇప్పటికీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేకున్నా అంటూ తన బాధను వెల్లగక్కాడు . ఇంతకీ ఎవరా నిర్మాత..ఏంటా కధ అనుకుంటున్నారా ఐతే మీరు ఓ లుక్కేయండి మరి..

అప్పట్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ మూవీ మీకు గుర్తుంది కదా. ఆ సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్ అశ్వినిదత్ స్వయంగా ఈ మాటలు అన్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన శక్తి, తారక్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. దర్శకుడు కథ చెప్పిన విధానం బాగా నచ్చడంతో, ఖర్చు గురించి పెద్దగా ఆలోచించకుండా పెట్టాడట అశ్వినిదత్. అయితే..ఆ సినిమా వల్ల దాదాపు 25 కోట్ల వరకు నష్టపోయానని, ఆ నష్టాన్ని కోలుకోవడానికి ఇంత కాలం పట్టిందని చెప్పుకొచ్చాడు ఈ భారీ చిత్రాల ప్రొడ్యూసర్. ఇక శక్తి తరువాత సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న ఈ మెగా ప్రొడ్యూసర్, రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఒక చిత్రాన్ని నిర్మించడానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. మరి అశ్వినీదత్ కు ‘ప్రిన్స్’ పాత కష్టాలను ఏ మేర తీరుస్తాడో చూడాలి మరి.

Loading...
[X] Close