[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Author Archives: Indion News (page 20)

Author Archives: Indion News

సీఎం కేసీఆర్ గృహప్రవేశాన్ని అడ్డుకుంటాం: TNSF

Telangana CM KCR's New House warming ceremony

విద్యార్థుల జీవితాలతో తెలంగాణా ప్రభుత్వం ఆడుకుంటోందని TNSF మండిపడింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్చేసింది. నేడు సెక్రటేరియట్ వద్ద TNSF ధర్నా చేపట్టింది. ఈ నేపద్యంలో TNSF అధ్యక్షుడు మధు మాట్లాడుతూ.. బకాయిలను విడుదల చేయడానికి ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు విధిస్తున్నామన్నాడు. అంతలోపు 2090 కోట్ల రూ. ను ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. తాము ఇచ్చిన గడువులోగా బకాయిలను విడుదల చేయకపోతే సీఎం కేసీఆర్ గృహ ప్రవేశాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.  ఈ ...

Read More »

పవన్ ని కలిసిన దత్తాత్రేయ.. ఎందుకో తెలుసా?

dattatreya meets pawan kalyan

జనసేనాని, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు. హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో ‘కాటమరాయుడు‘ చిత్రషూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఆయన కలిశారు. తన కూతురి వివాహ వేడుక కు హాజరుకావాలంటూ ఆయనకు శుభలేఖ అందజేశారు. కాగా పవన్ ని కలిసేందుకు వెళ్లిన దత్తాత్రేయను పవర్ స్టార్ ఆహ్వానించారు.

Read More »

మసీదులో ఆత్మాహుతి దాడి

suicide attack in masjid in kabul

ఆఫ్గనిస్థాన్ రాజధాని అయిన కాబూల్ లో ఈ రోజు ఓ దారుణం చోటు చేసుకుంది. షియా మతస్తుల మసీదులో ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనతో మసీదు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనతో.. ఏం జరుగుతున్నదో తెలియక ఉరుకులు.. పరుగులు పెట్టారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యులనేదానిపై ఇంతవరకు ఏ సంస్థ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Read More »

గాలికి చుక్కలు చూపిస్తున్న కూతురి పెళ్లి

Income Tax Ride on Gali Janardhan

కోట్ల రూపాయల ఖర్చుతో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించిన కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డికి ఆదాయ పన్ను శాఖ అధికారులు షాకిచ్చారు. ఆయనకు చెందిన మైనింగ్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బళ్లారిలోని ఓబులాపురం మైనింగ్ ఆఫీస్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం . ఇటీవల గాలి తన కూతురు బ్రాహ్మణి వివాహ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిపించిన విషయం తెలిసిందే. ...

Read More »

చైనా సూపర్ సిరీస్ విజేత PV సింధు

PV Sindhu Wins China Open Super Series Title

P.V సింధు తన కెరీర్ లో మొదటి సారిగా చైనా సూపర్ సిరీస్ టైటిల్ ను సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తర్వాత సింధు అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నేడు జరిగిన తుది పోరులో చైనా క్రీడాకారిణి సన్ యూపై 21-11,17-21,21-11 తేడాతో సింధు ఘణ విజయాన్ని సాధించింది.69  ని. ల పాటు జరిగిన ఈ పోరులో సింధు విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

Read More »

పాకిస్థాన్‌ కు అమెరికా మద్దతు!

america supports pakistan

ఉగ్రవాదంపై పోరుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా… పాకిస్తాన్ ను కోరింది. వేరే దేశంపై ఉగ్రదాడులను చేసేందుకు ఏ దేశమూ ఉగ్ర సంస్థలకుఆశ్రయం ఇవ్వకూడదని.. అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ భద్రతా దళాలు చేస్తున్న పోరాటంలో కొందరు సైనికులతోపాటు.. సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని.. వారి ప్రాణ త్యాగాలను తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చేసే పోరుకు అమెరికా మద్దతిస్తుందని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Read More »

ఒకరు మోసం చేయడం వల్లే ఆ సినిమా చేసా : కృష్ణవంశీ

krishna vamsi comments on his mogudu movie making

తెలుగులో ఉన్న ప్రతిభావంతులైన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. క్రియేటీవ్ దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరుంది. తొలి సినిమా గులాబి తోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడాయన. ఆ తర్వాత ఆయన తీసిన సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి, చందమామ వంటి సినిమాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పటివరకు కృష్ణవంశీ 19 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆయనకు చందమామ సినిమా ఫేవరేట్ అట.నేను తీసిన వాటిలో నాకు చాలా నచ్చింది చందమామ సినిమానే. మిగిలిన సినిమాలు నాకు నచ్చినా.. పూర్తి సంతృప్తి ఇచ్చింది ...

Read More »

రాజమౌళి నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే

rajamouli-crazy-projects-after-bahubali

బాహుబలి2 షూటింగ్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆ తరువాత గ్రాఫిక్ వర్క్ పూర్తిచేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 28న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరీ, ఈ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి నెక్స్ట్ ఏ ప్రాజెక్టు చేయబోతున్నాడు. భారీ చిత్రాల మీద దృష్టిపెట్టిన రాజమౌళి ఇక తెలుగు హీరోలను పెట్టి, సోలో సినిమాలు చెయ్యకపోచ్చనే టాక్ వినిపిస్తోంది. తీస్తే.. మల్టీస్టారర్ చిత్రాలనే తీసే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జక్కన్న అమీర్ ఖాన్ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం. అమీర్ ఖాన్ ...

Read More »

చేతులు కలుపుతున్న మెగా ,నందమూరి హీరోలు

Jr NTR & Allu Arjun Multistarrer Movie

ఒక వైపు నందమూరి హీరోలు, మరోవైపు మెగా హీరోలు.. టాలీవుడ్ లో సందడంతా ఈ రెండు కుటుంబాల హీరోలదే. ఈ కుటుంబాల హీరోలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మెగా, నందమూరి హీరోలు కలసి మల్టీస్లారర్ సినిమాలు చేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. కానీ, అలాంటి సాహసం ఇప్పటి వరకు ఎవ్వరూ చేయడంలేదు. కల్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ కలిసి ఓ మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలో మరో మెగానందమూరి కాంబినేషన్ కూడా రాబోతున్నట్లు లేటెస్ట్ టాక్. అది కూడా ఎన్టీఆర్, ...

Read More »

బాహుబలిలో జూనియర్ ఎన్టీఆర్?

ntr-in-bahubali

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెడ్డం పెంచి ఒక్కసారిగా అందరిలో ఆసక్తిని పెంచేశాడు. ఫస్ట్ గుబురు గెడ్డంతో కనిపించిన తారక్.. మంత్రి తలసాని కుమార్తె పెళ్లి రిసెప్షన్ లో గెడ్డాన్ని కాస్త తగ్గించి, రాజసం ఉట్టిపడే మీసంతో కనిపించాడు. తారక్ తాను తరువాత చేయబోయే సినిమా కోసమే కొత్త లుక్ లో కనిపిస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే తారక్ ఏ సినిమా చేయబోతున్నాడు. తారక్ న్యూ లుక్.. పవర్ ఫుల్ పోలీసు పాత్రకు గాని, లేదంటే, బాహుబలి లాంటి చిత్రంలో గాని సూపర్ గా ...

Read More »

పెద్ద నోట్ల రద్దుతో వీళ్ళ పరిస్థితి చూడండి …!

night-life-after-currency-demonetization

నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్ లో నైట్ లైఫ్ సందడి తగ్గింది. కనీసం వీకెండ్ లోనూ ఆ జోరు కనిపించడంలేదు. పెద్ద నోటు లేకపోవడంతో నైట్ లైఫ్ పై ఆసక్తితగ్గిందంటున్నారు పార్టీ ప్రియులు. పబ్‌లు సైతం వీకెండ్స్‌లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్డు ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు సైతం యువత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫ్యాషన్‌, మోడల్‌ షోలు తగ్గాయి.దీంతో నిర్వాహకులకు భారీగా కోతపడుతోంది. అయితే నైట్  లైఫ్ లేకుండా ఉండలేమనుకుంటున్న కొందరు హౌస్‌ పార్టీలకు తెరతీస్తున్నారు. ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని  జాలీగా పార్టీల్లో ముగినితేలుతున్నారు. ...

Read More »

అమ్మ నల్లధనం సంగతేంటి? – Indion News

jayalalitha-black-money-where-is-jayalalitha-black-money-what-is-tn-cm-health-condition

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతిపరులంతా లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు సీఎం జయలలిత  ఆపార సంపదపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.  అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ పెద్దనోట్లు రద్దు చేయడంతో అమ్మ కూడబెట్టిన సొమ్ముపై భిన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జయలలిత ముఖ్యమంత్రి కాకముందే ఆమె వద్ద వేలకోట్ల సొమ్ము ఉందనే టాక్ ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక అమె సంపాదన చాలా రేట్లు ...

Read More »
[X] Close