[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » ముందే రిలీజ్ కాబోతున్న బాహుబలి 2?

ముందే రిలీజ్ కాబోతున్న బాహుబలి 2?

baahubali 2 release date

ఏప్రిల్ 28 కంటే ముందే.. బాహుబలి మూవీ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? అంటే టీటౌన్ లో అవుననే టాక్ వినిస్తోంది. బాహుబ‌లి 2ని ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తామ‌ని, కొన్ని నెల‌ల క్రిత‌మే రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు. అయితే ఇప్పుడు ఈ డేట్ మార్పిడి విష‌యంలో రాజ‌మౌళి అండ్ కో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. దానికి కార‌ణం.. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని దృశ్యాలు లీక్ అవ్వ‌డ‌మే. సినిమా షూటింగ్ పూర్తయి, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. 2017 జ‌న‌వ‌రిక‌ల్లా ఫ‌స్ట్ కాపీ కూడా చేతికి వ‌చ్చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి, మార్చిల‌లో ప్ర‌మోష‌న్లు భారీగా చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. సినిమా పూర్త‌యి, ఫస్ట్ కాపీ చేతిలో ఉన్న‌ప్పుడు సినిమాని దాచుకోవ‌డం కంటే, విడుద‌ల చేసేయ‌డ‌మే బెట‌ర్ అన్న‌ది రాజ‌మౌళి అండ్ టీమ్ అభిప్రాయం. లీకేజీల బెడ‌ద ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేయ‌డ‌మే మంచిద‌ని, ఏప్రిల్ 28కి క‌నీసం రెండు మూడు వారాల ముందే బాహుబ‌లిని తీసుకొస్తే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నారట. అయితే బాలీవుడ్‌లో ఓ సినిమా విడుద‌ల కావాలంటే.. యేడాది ముందే క్లియ‌రెన్స్ తీసుకోవాలి. అప్ప‌టిక‌ప్పుడు రిలీజ్ డేట్ మార్చ‌డం అంత తేలిక కాదు. బాహుబ‌లి 2 వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌తో కొన్ని హిందీ సినిమాలు ఏప్రిల్ చివ‌రి వారంలో రావ‌డానికి సాహ‌సించ‌డం లేదు. బాహుబ‌లి 2 రిలీజ్ డేట్ మారితే.. ఆ సినిమాల‌న్నీ రిలీజ్ డేట్లు మార్చుకోవాలి. ఇదంతా అయ్యే పనికాదు.అయితే ఆ ఒక్క కార‌ణం మిన‌హాయిస్తే మాత్రం బాహుబ‌లి 2 ముందే విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. …

Loading...
[X] Close