[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » 79 రోజుల్లో ‘బాలకృష్ణతో’ క్రిష్ అద్భుత సృష్టి

79 రోజుల్లో ‘బాలకృష్ణతో’ క్రిష్ అద్భుత సృష్టి

Balakrishna Gautamiputra Satakarni Movie Shooting COMPLETED

చిన్న సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా నెలల తరబడి షూటింగ్ చేస్తుంటారు దర్శకులు. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి ఏళ్ల తరబడి తీస్తూనే ఉన్నాడు. ఈ క్రియేటీవ్ ఫీల్డ్ లో సినిమా అద్భుతంగా రావాలంటే.. టైం కేటాయించడం తప్పనిసరి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే జరుగుతోంది. కాస్త భిన్నంగా రాంగోపాల్ వర్మ. పూరి జగన్నాధ్ లాంటి దర్శకులు నెలరోజుల్లోనే సినిమాలు తీసేస్తున్నారు. అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాలను ఇంత తక్కువ టైంలో తియ్యడం అసాధ్యం. కానీ, దర్శకుడు క్రిష్ మాత్రం అద్భుతం చేశాడు. ఇంతకీ ఏంటా అద్భుతం. వాచ్ దిస్ స్టోరీ.  నేషనల్ అవార్డు విన్నర్ క్రిష్ దర్శకత్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన హిస్టారిక‌ల్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`. హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రం రీసెంట్ గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని గుమ్మ‌డియకాయ వేడుక‌ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలింసిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయా, హేమామాలినిపై ద‌ర్శ‌కుడు క్రిష్ చివ‌రి సన్నివేశాన్ని చిత్రీక‌రించారు. శాతకర్ణి సినిమా షూటింగ్ మొరాకోలోని అట్లాస్ స్టూడియోలో వార్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా మొరాకోలో రోజుకు 14 నుండి 16 గంటల పాటు ఏక‌ధాటిగా షూటింగ్ చేశారు.ఆ తరువాత చిలుకూరి బాలాజీ ఆల‌య స‌మీపంలో మే 30 నుండి భారీ యుద్ధ నౌక సెట్ వేసి రెండో షెడ్యూల్‌ను చిత్రీక‌రించారు.  మూడో షెడ్యూల్ జార్జియాలో జరిగింది. జూలై 4న జార్టియాలో మౌంట్ కెజ్‌బెగ్‌లో ప్రారంభ‌మైన ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. శాత‌వాహ‌న సైనికుల‌కు, గ్రీకు సైనికుల‌కు మ‌ధ్య జ‌రిగే యుద్ధ స‌న్నివేశాల‌ను అక్కడ చిత్రీక‌రించ‌డం జ‌రిగింది. 1000 జానియ‌ర్ ఆర్టిస్టులు, 300 గుర్రాలు, 20 ర‌థాలతో ఈ షెడ్యూల్ చిత్రీక‌రించారు. నాలుగో షెడ్యూల్‌ను ఆగ‌స్ట్ 29న నుండి సెప్టెంబ‌ర్ 20 వ‌ర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిత్రీక‌రించారు. ఇందులో రాజ‌సూయ యాగ స‌న్నివేశాలు, స‌హా కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేశారు. క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన స‌న్నివేశాలు స‌హా చిన్న చిన్న ప్యాచ్ వ‌ర్క్‌ల‌ను, బృంద మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో ఓ సాంగ్‌ను చిత్రీక‌రించారు. ఇంత భారీ చిత్రాన్ని కేవలం79 రోజుల్లోనే పూర్తి చేశాడు దర్శకుడు క్రిష్. బాలకృష్ణ సినిమా కోసం చాలా శ్రమించారు. టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ, పూరిజగన్నాధ్ లాంటి దర్శకుడు రెండు మూడు నెలల గ్యాప్ లోనే సినిమాలు తీస్తున్నారు. అయితే శాతకర్ణి లాంటి భారీ చిత్రాన్ని క్రిష్ ఇంత తక్కువ టైంలో తెరకెక్కించడం అద్భుతమనే చెప్పాలి.

Loading...
[X] Close