[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » బాలయ్యకు మాటిచ్చిన KCR

బాలయ్యకు మాటిచ్చిన KCR

balakrishna-gets-kcr-naidu-for-launch
బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అరుదైన సందర్భానికి వేదిక కాబోతుంది. సంక్రాంతికి రిలీజయ్యే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షో వెయ్యాలని దర్శక, నిర్మాతలు
భావిస్తున్నారు.ప్రారంభోత్సం సమయంలోనే కేసీఆర్ తప్పుకుండా ఈ సినిమా చూస్తానని బాలకృష్ణకు హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీల్లో తన పరిపాలనా ముద్ర వేసిన శాతవాహన చక్రవర్తి కథ ఆధారంగా వస్తున్న సినిమాను ఎట్టి
పరిస్థితుల్లోనూ మిస్సవ్వనని చెప్పారు. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా సినిమా చూపించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని చూడడం మిస్ కావొద్దని భావిస్తున్నారట. సో మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జనవరి 3వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షో కోసం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక త్వరలో ఆడియో వేడుక నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో వేడుక విజయవాడలో కానీ, తిరుపతిలో కాని నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Loading...
[X] Close
Share