[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » విమానంలో బాలయ్య తడాఖా..!

విమానంలో బాలయ్య తడాఖా..!

నందమూరి నటసింహం బాలయ్య విమానంలో తన తడాఖా చూపించాడు. పౌరాణిక సినిమాల్లో డైలాగ్స్ చెప్పడంలో బాbalakrishnaలయ్య దిట్ట. ఎంత పెద్ద డైలాగ్స్ అయినా యిట్టె చెప్పెయగలడు. ఇంతకు జరిగిన విషయం ఏంటంటే… బాలయ్య విమానంలో వెలుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు తన ట్యాబ్లెట్‌లో మాయాబజార్ సినిమా చూస్తున్నాడు. విమానంలో బాలయ్య ఉన్న విషయం గమనించిన ఆ ప్రయాణికుడు ఆయన పక్కసీటుకు వెళ్లి కూర్చున్నాడు. తనకు క్లాసికల్ మూవీస్ అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్‌కు వీరాభిమాని అని చెప్పి… ట్యాబ్లెట్ బాలయ్య చేతిలో పెట్టి ‘దానవీర సూరకర్ణ’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ‘సోదరా భీమ సేనా… అనే భారీ డైలాగ్ ఒకటి చెప్పాలని బాలయ్యను కోరడంతో.. కాదనలేని బాలయ్య గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పేశాడు. దీనిని అంతా వీడియో తీశారు. తన తండ్రి సినిమాలోని డైలాగ్ బాలయ్య అలవోకగా చెప్పేయడంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి మీరు ఆ సన్నివేశాన్ని ఒకసారి తిలకించండి.

 

Loading...
[X] Close
Share