[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » బెంగళూరులో విరుచుకుపడ్డ మృగాళ్లు .. వారు ఏ ఒక్క అమ్మాయినీ వ‌ద‌ల్లేదు

బెంగళూరులో విరుచుకుపడ్డ మృగాళ్లు .. వారు ఏ ఒక్క అమ్మాయినీ వ‌ద‌ల్లేదు

Bangalore Molestation - Girls Molested At New Year 2017 MG Road Bangalore

కొత్త సంవత్సరం సాక్షిగా ఆడ‌వాళ్ల‌పై మృగాళ్లు విరుచుకుపడ్డారు. బెంగుళూరు నగరంలో జరిగిన ఈ ఘటనలో భయంకర నిజాలు బయటకొస్తున్నాయ్. ఆడ‌వారిపై అఘాయిత్యాలు చేయ‌టానికి మృగాళ్లు ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేదు అన‌టానికి ఇదొక ఉదాహార‌ణ. దేశ‌మంతా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్లో కోలాహ‌లం చేస్తుంటే, సాఫ్ట్ వేర్ నగరంగా ప్రసిద్ధి చెందిన బెంగుళూర్ ఎంజీ రోడ్డు మాత్రం ఆడ‌వాళ్ల ఆర్త‌నాధాల‌తో మారుమ్రోగింది. మృగాళ్ల భయంకర చేష్టలతో, నెత్తురు దార‌ల‌తో త‌డిచిపోయింది. మ‌మ్మ‌ల్ని కాపాడండి అంటూ మ‌హిళ‌లు వేసిన కేక‌లు ఈ దారుణానికి ప్ర‌త్యేక నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

ఆనందంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లను జ‌రుపుకునేందుకు తోటి వారితో క‌లిసి బెంగుళూర్ ఎంజీ రోడ్డుపైకి వచ్చారు అక్క‌డి యువ‌తులు,మ‌హిళ‌లు. అయితే కొందరు యువకులు ముందుగానే వేసుకున్న పథకంతో 100ల మందిగా ఏర్ప‌డి ఆడ‌వాళ్ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ భయంకరమైన లైంగిక దాడిని ప్ర‌త్య‌క్షంగా చూసిన ఓ యువ‌తి ఈ విధంగా వివ‌ర‌ణ ఇచ్చింది. పార్టీలో యువకులు, ఇంకొందరు పురుషులు ఆడవాళ్ళతో దారుణంగా ప్రవర్తించారు. ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు. వారి ముందు నుంచి వెళుతున్న ప్రతి అమ్మాయిని తాకుతు అసభ్యంగా ప్రవర్తించారు. బలవంతంగా దగ్గరకు లాక్కున్నారు. అభ్యంతరకరంగా కొన్ని ప్రైవేట్ భాగాలపై తాకారు. కొంతమంది అమ్మాయిలను జుట్టుపట్టి ఈడ్చి,బట్టలను చింపేశారు. భయంతో మహిళలు ఏడుస్తూ పరుగెడుతున్నా వారిని వదలిపెట్టలేదు. సాధారణంగా ఒక్కరు,ఇద్దరిపై అయితే పోరాడగలం. కానీ, అక్కడ ఉంది వేలమంది సమూహం. ఏం చేయగలం అంటూ వాపోయింది. ఉద్దేశ పూర్వకంగానే వాళ్ళు మహిళలను టార్గెట్‌ చేశారు. ఇది ఒక భారీ లైంగిక వేధింపుల ఘటనగా చెప్పవచ్చు. చాలామంది తాగి ఉన్నారు. ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. ఎంత అసభ్యంగా చేశారంటే మాటల్లో చెప్పలేం. ఒక్క అమ్మాయిని కూడా ఆ మృగాళ్లు హింసించకుండా విడిచిపెట్టలేదు. ఒక మహిళ ఏడుస్తుంటే చూశాను. ఆమెకు రక్తం కారుతోంది. శరీరం మొత్తం గాయాలయ్యాయి. అంత దారుణంగా అక్కడ యువకులు ప్రవర్తించారు అంటూ యువతి ఆ ఘటన గురించి తెలిపింది.

Loading...
[X] Close
Share