[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » మహేష్ బాబు కి తొందరెక్కువ

మహేష్ బాబు కి తొందరెక్కువ

Bharat Anu Nenu Mahesh babu s Next film with Koritala siva

సినిమా టైటిల్స్ విషయంలో టాలీవుడ్ హీరోలు పక్కా క్లారిటీతో ఉంటారు. మాస్ ను ఆకట్టుకునేలా సినిమా టైటిల్ ఉండేలా చూసుకుంటారు.  పోకిరి మూవీ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇదే ఫాలో అవుతున్నాడు. అయితే ఆగడు ప్లాప్ తరువాత మహేష్ బాబు రూట్ మార్చాడు. ప్రస్తుతం  మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి ఇంకా పేరు కన్ఫమ్ కాలేదు. అయితే కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి మాత్రం అప్పుడే పేరు పెట్టేశారు. మరోసారి డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ప్రిన్స్ మహేష్ బాబు. బ్రహ్మోత్సవం మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత స్పీడ్ పెంచాడు. మురుగదాస్ మూవీ చేస్తూనే ఇటు కొరటాల శివ, అటు వంశీ పైడిపల్లి సినిమాలకు సంబంధించి పనులను వేగవంతం చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అహ్మదాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత కొరటాలతో కలిసి ఓ మూవీ చేయనున్నాడు మహేష్. గత నెలలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో మహేష్ సరసన కొత్త భామని కథానాయికగా సెలక్ట్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి భరత్ అనే నేను టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను నిర్మిస్తోన్న డీవీవీ దానయ్య తాజాగా ఫిల్మ్‌ఛాంబర్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై భరత్ అనే నేను టైటిల్ రిజిస్టర్ చేయించారు. దాంతో కొరటాల-మహేష్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ టైటిల్ భరత్ అనే నేను అని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేయనుండగా, పలువురు టాప్ టెక్నీషియన్స్ ఈ టీంతో జాయిన్ కానున్నట్టు సమాచారం.

Loading...
[X] Close