[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » పామును పెళ్లి చేసుకున్న యువకుడు

పామును పెళ్లి చేసుకున్న యువకుడు

thailand-boy-marriages-snake

థాయ్‌లాండ్‌ కు చెందిన ఓ యువకుడు  పది అడుగుల పొడవు ఉన్న పామును వివాహం చేసుకున్నాడు. అదేంటి అని అతడిని అడిగితే.. ఆ పామును చూస్తుంటే అచ్చం 5 ఏళ్ళ క్రితం చనిపోయిన తన ప్రియురాలి లాగానే ఉందని, అందుకే దాన్ని పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అంతేగాక వీరిద్దరూ కలిసి టీవీ చూడటం, బయట పార్కులకి వెళ్లడం, ఇలా అన్ని చోట్లా తరచు జంటగా కనిపిస్తూఉండేవాడు.. దీన్ని చూసి అందరు ఆశ్చర్యానికి గురయ్యేవారట. అయితే ఈ చిత్రాలను అదే దేశానికి చెందిన వరానన్ అనే వ్యక్తి ఇంటర్ నెట్ లో పెట్టాడు. తనకు అతను భాగా  తెలుసునని, వీరిద్దరూ చాలా అనోన్యంగా ఉంటారని చెప్పాడు. చనిపోయిన వారు జంతువుల రూపంలో మళ్ళీ జన్మిస్తారనే సిద్ధాంతాన్ని ఈ యువకుడు గట్టిగ నమ్ముతాడని అందుకే ఈ పెళ్లి చేసుకున్నానని వరానన్ వివరించాడు.

Loading...
[X] Close
Share