[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » పవన్ కళ్యాణ్ తో గొడవపై ఆయన మరోసారి స్పందించాడు…!

పవన్ కళ్యాణ్ తో గొడవపై ఆయన మరోసారి స్పందించాడు…!

BVSN Prasad Responds on Pawan Kalyan Contorversy Issue

నాన్నకు ప్రేమతో రిలీజ్ కు ముందు భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు పవన్ కల్యాణ్ పెద్ద షాకిచ్చాడు‌. అత్తారింటికి దారేది సినిమాను ఆయనే నిర్మించారు‌. ఈ సినిమా భారీ హిట్ కొట్టినా.. పవన్ కల్యాణ్ కు ప్రసాద్ పారితోషికాన్ని పూర్తిగా ఇవ్వలేదు. దాంతో ఆ డబ్బుల కోసం ఛాంబర్‌కు కంప్లైంట్‌ చేసి పవన్ కల్యాణ్ సంచలనం సృష్టించాడు. రీసెంట్ గా ఈ విషయంపై నిర్మాత ప్రసాద్ నోరు విప్పాడు‌. తాను పవన్‌గారికి డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయడం నిజమే. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నేను ఆ సమయంలో అలాంటి పరిస్థితిలో ఉండడం నా దురదృష్టం. పవన్‌ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇబ్బంది పడ్డానని చెప్పాడు. నాన్నకు ప్రేమతో సినిమాకు ముందు పవన్‌ కంప్లైంట్‌ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డానని, అయితే అలాంటివి జరుగుతుంటాయని ఆయన వెల్లడించాడు. కాగా, అత్తారింటికి దారేది సినిమాపై తలెత్తిన పైరసీ సంక్షోభం నుంచి తాను గట్టెక్కడానికి పవన్‌, త్రివిక్రమ్‌ ఎంతో సాయం చేశారని ప్రసాద్ గుర్తు చేసుకున్నాడు.

Loading...
[X] Close