[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » అక్కడ పవర్ స్టార్ ని దాటేసిన మెగాస్టార్…!

అక్కడ పవర్ స్టార్ ని దాటేసిన మెగాస్టార్…!

Chiranjeevi's Khaidi No 150 Distribution Rights in kanataka

చిరు రీఎంట్రీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఖైదీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఈ మూవీ రైట్స్ బాహుబలికి మించి అత్యధిక రేట్లకు అమ్ముడుపోయాయి. ఇక నైజాంలోనూ 21 కోట్లకు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నాడు. అటు శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్మడయ్యాయి. ఇక తాజాగా ఓవర్సీస్ రైట్స్ ఆల్‌టైమ్ రికార్డ్ ధరకి అమ్ముడుపోయినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని అక్షరాల14 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో మహేష్ బ్రహ్మోత్సవం,బాహుబలి రికార్డులు బద్దలైపోయాయి. ఓవర్సీస్ లో ఖైదీ మూవీదే ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు. ఓవర్సీస్ విషయంలో మిగతా సినిమాలకంటే టాప్ లో ఉండాలని పట్టుబట్టి మరీ, చరణ్14 కోట్లకు డీల్ కుదుర్చుకుని.. తన పంథా నెగ్గించుకున్నాడు. అయితే 3 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తుందనే నమ్మకంతోనే ఏషియన్ ఫిల్మ్స్ ఇంత ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కన్నడ రైట్స్ 8.5 కోట్లు అమ్ముడు పోవడం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సినిమాలు కూడా అక్కడ ఈ స్థాయిలో అమ్ముడవ్వలేదు. మొత్తంగా ఖైదీ 75 కోట్ల మేర వ్యాపారం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే.. ఇప్పటిదాకా చిరంజీవి సినిమాలేవీ ఇప్పటి వరకు 40 కోట్ల మార్కును కూడా దాటలేదు. దీనికి కారణం చిరంజీవి సినిమాలకు దూరమైన ఈ8 ఏళ్లలో తెలుగు సినీ ఇండస్ట్రీ మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదేగాక ఇటీవల టికెట్ రేట్లు కూడా అమాంతం పెరిగాయి. వీటన్నింటిని పక్కన పెడితే.. చిరు లాంగ్ గ్యాప్ తరువాత సినిమా చేస్తుండడంతో పెట్టిన డబ్బుకు లాభాలు వచ్చితీరుతాయనే నమ్మకం ఉంది. మొత్తానికి ఈ కారణాలతోనే చిరు మూవీకి మార్కెట్ భారీగా జరుగుతోందని, ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే జనవరి 4వ తేదీన భారీఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

Loading...
[X] Close