[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్ » సచిన్ కిడ్నాప్ కు కుట్ర!

సచిన్ కిడ్నాప్ కు కుట్ర!

David Cameron wants to kidnap Sachin Tendulkar to train England cricket team

సచిన్ ను కిడ్నప్ చేయడమేంటి అనుకుంటున్నారా? కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ అనుకోకండి..! టీమిండియాతో టెస్ట్‌ సిరీస్ లో భాగంగా  తాజాగా ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. దీంతో ఇంగ్లండ్‌ ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు ఒక ఉపాయం తట్టింది. భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను కిడ్నాప్‌ చేసి కోచింగ్‌ ఇప్పిస్తే ఇంగ్లండ్‌ ఆట గాడిలో పడుతుందని కామెరూన్‌ జోక్‌ చేశారు.  కుక్‌సేన వైఫల్యం కామెరూన్‌ను కూడా తీవ్రంగా బాధించి ఉంటుంది. అందుకే ఆయన పైవిధంగా మాట్లాడి ఉంటారు. డేవిడ్‌ క్రికెట్‌ను బాగా ఇష్టపడతారు. కామెరూన్‌ శనివారం జరిగిన హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్‌, డేవిడ్‌ పరస్పరం కలుసుకున్నప్పుడు ఈ సరదా సంభాషణ చోటు చేసుకుంది.ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ 0-2తో వెనకబడి ఉంది. రాజ్‌కోట్‌ టెస్ట్‌లో మాత్రమే కుక్‌సేన ఆతిథ్య భారతకు గట్టిపోటీ ఇవ్వగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పోరాటంతో టీమిండియా ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తర్వాత అద్భుత ప్రదర్శనతో పుంజుకున్న భారతకు విశాఖపట్నం, మొహాలీ టెస్ట్‌ల్లో ఎదురులేకుండా పోయింది. ఇక ఈ నెల 8న ముంబైలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ మొదలు కానుంది. ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ కుక్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ మాత్రమే సీనియర్‌ ఆటగాళ్లు. స్పిన్‌ విభాగం బలహీనంగా ఉండడం కూడా పర్యాటక జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. టెస్ట్‌ సిరీస్ ప్రస్తుత పరిస్థితిని బట్టి సచిన్‌ను కిడ్నాప్‌ చేయడం కంటే మరో మార్గం కనిపించడం లేదు. టెండూల్కర్‌తో శిక్షణ ఇప్పిస్తే ఇంగ్లండ్‌ ప్రదర్శన మెరుగుపడుతుందని ఆశిస్తున్నా అంటూ కామెరూన్ తెలిపారు. ఇదంతా సరదాకే అయినా.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికార వర్గాల్లోనూ ఇలాంటి ఆలోచన ఉందేమోనని అనిపిస్తోంది. భవిష్యత్ లో ఇంగ్లాండ్ ఇలాంటి ప్రతిపాదనను ఏమైనా సచిన్ ముందుకు తెస్తుందో చూడాలి.

Loading...
[X] Close
Share