[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » దేవిశ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

దేవిశ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

devi sri prasad shocking remuneration

దేవీశ్రీప్రసాద్‌.. దక్షిణాది టాప్ 5 దర్శకుల్లో ఒకరు. మిగతా దర్శకులతో పోలిస్తే.. దేవి తమిళ, తెలుగు భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఏఆర్ రహమాన్, హరీస్ జైరాజ్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లతో పోలిస్తే.. దేవికి మాస్ ఇమేజ్ చాలా ఎక్కువ. ఇదే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా ప్లస్ అవుతోంది. దీంతో మిగతా సంగీత దర్శకులతో పోలిస్తే.. అవకాశాలు కూడా దేవికి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రెమ్యూనరేషన్ విషయంలో దేవి టాప్ టుకి చేరిపోయాడు. గతంలో రెహమాన్‌, హారీస్‌తో పోల్చుకుంటే దేవి రెమ్యునరేషన్‌ కాస్త తక్కువగానే ఉండేది. రెహమాన్‌ సినిమాను బట్టి 4 నుంచి 6 కోట్ల రూపాయల వరకు డిమాండ్‌ చేస్తే.. హారిస్‌ సినిమాకు మూడు కోట్ల రూపాయలు తీసుకునేవాడు. కానీ, దేవి ఇప్పటివరకు హారిస్‌ కంటే తక్కువగా 2.5 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకునేవాడు. అయితే ఇటీవల తన పారితోషికాన్ని దేవిశ్రీప్రాసాద్ 3 కోట్ల రూపాయలకు పెంచాడని టాక్. ప్రస్తుతం రెహమాన్‌ తో పోలిస్తే రెమ్యూనరేషన్ విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నా.. సౌత్‌లో దేవీయే టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహంలేదు.

Loading...
[X] Close