[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » బిజినెస్ » మీ ATM కార్డే మీ పర్సు..!

మీ ATM కార్డే మీ పర్సు..!

digital india

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రప్రభుత్వం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి బ్యాంక్ కార్డ్ భద్రంగా ఉండే విధంగా దానికి ఆన్, ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి ఏటీఎంలను సులభంగా నియంత్రించవచ్చు. ఈ యాప్ తో మీ ఏటీఎం  కార్డ్ ను కనెక్ట్ చేసుకుని.. స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఏటీఎం సెంటర్ కు వెళ్లినప్పుడు ఆన్ చేసుకుంటే.. కార్డ్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డ్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీ ఎటీఎం కార్డ్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయటానికి వీలుండదు. ఏటీఎం కార్డ్ ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే యాప్ ద్వారా దానిని ఆన్ చేసుకుంటే సేఫ్ గా ఉంటుందని SBI అధికారులు చెబుతున్నారు. మిగతా సమయాల్లో ఆఫ్ లో ఉంచుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో అన్ని క్రయ, విక్రయాలు కార్డ్ ద్వారానే జరుగనున్నాయి. ఈ క్రమంలోనే కార్డ్ కు మరింత భద్రత కల్పిస్తున్నట్లు బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Loading...
[X] Close
Share