[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » శాతకర్ణి ఓపెనింగ్ డే కలెక్షన్లు ఇవే..!

శాతకర్ణి ఓపెనింగ్ డే కలెక్షన్లు ఇవే..!

Gautamiputra Satakarni First Day Box Office Collections Report

బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలయ్య కెరీర్లోనే ఓపెనింగ్ డేలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు దాదాపు 10.41 కోట్లు వసూలు చేసిందని సమాచారం. బాలయ్య కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఇది రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 37 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలి రోజే10 కోట్లు రావడంతో… ఫస్ట్ వీక్ పూర్తయ్యేలోగా కలెక్షన్స్ మొత్తం రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. నైజాం లో 2.3 కోట్లు.. సీడెడ్ లో 2.15 కోట్లు, కృష్ణలో 80 లక్షలు, గుంటూరులో 1.64 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో78 లక్షలు వైజాగ్ లో 88 లక్షలు, నెల్లూరులో 37 లక్షలు. ప్రస్తుతం సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే.. వారం పూర్తయ్యేలోగా పెట్టిన డబ్బులు మొత్తం శాతకర్ణి తిరిగి రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Loading...
[X] Close
Share